శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (09:04 IST)

'అజ్ఞాతవాసి'పై అంతులేని అభిమానం.. ముందే సంక్రాంతి సందడి

తెలుగు రాష్ట్రాల్లో "అజ్ఞాతవాసి" సందడి చేస్తున్నాడు. దీంతో పెద్ద పండుగకు ముందే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ నటించిన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' బుధవారం

తెలుగు రాష్ట్రాల్లో "అజ్ఞాతవాసి" సందడి చేస్తున్నాడు. దీంతో పెద్ద పండుగకు ముందే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ నటించిన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం అర్థరాత్రి నుంచి ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

అంటే రోజుకు ఏడు ఆటలు. కానీ, తెలంగాణాలో మాత్రం తొక్కిసలాట భయంతో 5 ఆటలకే అనుమతి ఇచ్చారు. ఫలితంగా బుధవారం ఉదయం నుంచి ఈ చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. దీంతో ఈ చిత్రం విడుదలైన థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తోంది. 
 
పవన్ కల్యాణ్‌పై ప్రత్యేక అభిమానం చూపిస్తూ ప్లెక్సీలు, పాలాభిషేకాలు ఇలా చేస్తూ వారి అభిమానం చాటి చెబుతున్నారు. అయితే, మరి అందరిలా చేస్తే లెక్కేం ఉంటుందని భావించినట్లున్నాడు. ధర్మవరం చెందిన చేనేత కార్మికుడు తన ప్రతిభతో పవన్ కల్యాణ్‌పై అంతులేని అభిమానాన్ని చేతల్లో చూపించాడు.

'అజ్ఞాతవాసి' స్టిల్స్‌తో ఆయన చేసిన శారీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ అభిమానం గురించి చెప్పాలంటే దానికి అంతే ఉండదు.. అనేదానికి ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం విశేషం.