సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (18:02 IST)

'అజ్ఞాతవాసి' రోజుకు 7 ఆటలు.. చంద్రబాబు స్పెషల్ షో అనుమతులు (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కి, ఈనెల పదో తేదీన రిలీజ్ కానున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. పపన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కి, ఈనెల పదో తేదీన రిలీజ్ కానున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. పపన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో 'అజ్ఞాతవాసి' స్పెషల్ షోలను ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ఈ ప్రత్యేక షోలను 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ప్రదర్శించుకునేందుకు అంగీకరించింది. 
 
సంక్రాంతి సెలవుల దృష్య్యా, నైట్ షాపింగ్‌కు ఇప్పటికే అనుమతులు ఇచ్చామని, సెలవు రోజుల్లో రాత్రి పూట సినిమా ప్రదర్శనలకు అనుమతి కావాలంటూ చాలా రోజులుగా డిమాండ్ వస్తున్నదని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. 
 
అయితే, పవన్ వ్యతిరేకులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు - పవన్ కళ్యాణ్‌కు మధ్య ఉన్న సత్‌సంబంధం కారణంగానే ఈ తరహా అనుమతి మంజూరు చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.