శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (11:26 IST)

హాలీవుడ్‌లోనూ పవన్ ఫీవర్... ఓవర్సీస్‌లో "అజ్ఞాతవాసి" రికార్డు

హాలీవుడ్‌లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోతోంది. ఈయన నటించిన తాజా చిత్రం "అజ్ఞాతవాసి". ఈనెల పదో తేదీన స్వదేశంలో ప్రేక్షకుల ముందుకురానుంది. కానీ, ఓవర్సీస్‌లో మాత్రం దానికంటే ముందుగానే రిలీజ

హాలీవుడ్‌లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోతోంది. ఈయన నటించిన తాజా చిత్రం "అజ్ఞాతవాసి". ఈనెల పదో తేదీన స్వదేశంలో ప్రేక్షకుల ముందుకురానుంది. కానీ, ఓవర్సీస్‌లో మాత్రం దానికంటే ముందుగానే రిలీజ్ కానుంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
ఇప్పటికే టాలీవుడ్‌లో 'అజ్ఞాతవాసి' ఫీవర్ ఓ రేంజ్‌లో ఉండగా, దానికంటే పది రెట్లు ఎక్కువగా హాలీవుడ్‌లోనూ కనిపిస్తోంది. ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో ముందు ప్రవాస భారతీయులు అజ్ఞాతవాసి విడుదలను పురస్కరించుకుని బ్యానర్లతో తమ సంతోషాన్ని తెలియజేసారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారాయి. 
 
ఓవ‌ర్సీస్‌లోనూ ప‌వ‌న్ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఏ భారతీయ మూవీ కూడా విడుద‌ల కాన‌న్ని థియేట‌ర్స్‌లో ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌లో విడుద‌ల కానుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కగా, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌లో మొత్తం 570 లొకేష‌న్స్‌లో విడుద‌ల కానుంది.