గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (16:31 IST)

శర్వానంద్, బివిఎస్ఎన్ ప్రసాద్ నూతన చిత్రం టైటిల్ "రాధ"

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ నటుడు శర్వానంద్, తన తదుపరి సినిమాని సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "రాధ" అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుద

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ నటుడు శర్వానంద్, తన తదుపరి సినిమాని సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "రాధ" అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
  
వినూత్నమైన కథలతో, మంచి నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న శర్వానంద్, ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తారు. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. వేసవి సెలవుల్లో, ఉగాది (మార్చ్ 29) రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
 
శర్వానంద్ సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌గా కనిపించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్రమోహన్ పని చేస్తున్నారు. అయన గతంలో కరుణాకరన్ వద్ద పని చేసిన టెక్నీషియన్. సమర్పకులు బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, " పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ , యాక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి రాధ అనే టైటిల్ చక్కగా సరిపోతుంది. ఉగాది రోజున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం", అని అన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత భోగవల్లి బాపినీడు.