శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : గురువారం, 19 నవంబరు 2015 (11:26 IST)

పంచెకట్టుతీసి.. గుజరాత్‌ వెళ్ళిన గబ్బర్‌సింగ్‌.. సర్దార్ వెంటే కాజల్ అగర్వాల్!

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌.. చిత్ర యూనిట్‌ గుజరాత్‌ వెళ్ళింది. రెండురోజులనాడే చిత్ర యూనిట్‌ వెళ్ళి అక్కడ పనులు వర్యవేక్షించారు. పంచెకట్టుతో కార్తీకమాస పూజలో వున్న పవన్ బుధవారంనాడే  షూటింగ్‌లో ఎంటరయ్యాడు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌కూడా ఓ నిర్మాత. 
 
ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌తో అంచనాలను విపరీతంగా పెంచాయి. ఇటీవలే హైదరాబాద్‌లో షెడ్యూల్‌ను పూర్తి చేసిన ఈ టీమ్‌, నెలరోజుల పాటు అక్కడే వుంటుంది.

ఈ షెడ్యూల్‌లో పవన్‌ కళ్యాణ్‌, కాజల్‌ అగర్వాల్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. ఏప్రిల్‌ నెలలో వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేలా దర్శక నిర్మాతలు సినిమాలు సన్నాహాలు చేసుకుంటున్నారు.