గురువారం, 26 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : సోమవారం, 9 మే 2016 (16:34 IST)

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న చిత్రం!

గతంలో జైహింద్‌ పిక్చర్స్‌ పతాకంపై జైహింద్‌గౌడ్‌ హీరోగా నిర్మాతగా సూపర్‌స్టార్‌ కృష్ణ సుమన్‌ ముఖ్యపాత్రలలో ఆర.‌కె.గౌడ్‌ దర్శక్వంలో వచ్చిన సర్ధార్‌ పర్వాయి పాపన్న చిత్రం విజయవంతం అయింది. తెలంగాణ సాయిధపోరాట యోధుడైన సర్ధార్‌ సర్వాయి పాపన్న2 జైహింద్‌ పిక్షర్స్‌ పతాకంపై బాలనర్సింహగౌడ్‌ నిర్మాతగా ఆర్‌.కె.గౌడ్‌ నిర్మాణ సారద్యంలో జైహింద్‌గౌడ్‌ సర్ధార్‌ పాపన్నగా నటించనున్నారు. 
 
హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో హీరో జైహింద్‌గౌడ్‌ మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సర్ధార్‌ సర్వాయి పాపన్నగా నేను గతంలో నటించాను.ఆసినిమా విజయవంతం అయింది. ఆ సినిమాలో పాపన్న చరిత్ర గురించి మొత్తం చూపించలేకపోవడంవల్ల సర్ధార్‌ సర్వాయి పాపన్న2గా మరికొంత భాగాన్ని తెరకెక్కించబోతున్నాము.
 
నిజానికి చెప్పాలంటే 5 భాగాలుగా సినిమా తీసినా కూడా ఆయన జీవిత చరిత్ర చూపించలేము అందుకే పార్ట్‌2 కొంతభాగాన్ని షూట్‌ చేయదలుచుకున్నాము. పేద, నిమ్న కులవృత్తులవారిని ఐక్యంచేసి జమిందారి, నవాబుల వ్యవస్థపై తిరుగుబాటు చేసిన గొప్ప పోరాట యోధుడు పాపన్న. ఆయన పాత్రను చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. 
 
ఈ సంద్బంగా ఆర్‌.కె గౌడ్‌ మాట్లాడుతూ... 350సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథ మొదటి భాగాన్ని నేను దర్శకత్వం వహించాను.ఇప్పుడు పార్ట్‌2 కి నిర్మాణసారాధ్యం వహించడం చాలా ఆనందంగా వుంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానున్న పార్ట్‌2 కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది. త్వరలోనే నటినటుల,సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. 
 
తెలంగాణ శానమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ... వందల ఎళ్ల క్రితమే జమిందారి, నవాబుల పెత్తనాన్ని ఎదిరించి, పోరాడి గొల్గోండ కోటను సైతం తన వశం చేసుకొని 14 రోజులు తన ఆధీనంలో వుంచుకొని అదేగోల్గొండ కోటలో ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించి హిందు గొప్ప తనాన్ని చాటిన వ్యక్తి సర్ధార్‌ సర్వాయి పాపన్న. 
 
తెలంగాణలో బోనాల పండగా వచ్చిందంటే మొదటి బోనాలు గోల్గొండకోట నుండే ప్రారంభ అవుతాయి. అంతగొప్ప చరిత్ర సృష్టించిన సర్ధార్‌ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర సినిమాగా రావడం ఆనందంగా వుంది అన్నారు. 
 
సీనియర్‌ సినీనటుడు సుమన్‌ మాట్లాడుతూ... సర్ధార్‌ సర్వాయి పాపన్న సినిమా మొదటి భాగంలో పాపన్న తండ్రిగా నటించడం జరిగింది.అంతగొప్ప చరిత్ర కలిగిన యోధుడికి తండ్రిగా నటించడం, మళ్ళీ పార్ట్‌2లో నటిస్తున్నందుకు ఒక నటుడుగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అని ఆయన అన్నారు. 
 
నిర్మాత బాలనర్సింహా గౌడ్‌ మాట్లాడుతూ... సర్ధార్‌ సర్వాయి పాపన్న2 సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం నా పూర్వజన్మ సుకృతం. పాపన్న గొప్ప తెలంగాణ యోధుడు ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.