శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మే 2022 (16:17 IST)

మహేశ్ "సర్కారు వారి పాట"కు యూఏ సర్టిఫికేట్

SarkaruVaariPaata
ప్రిన్స్ మహేశ్ బాబు కొత్త చిత్రం "సర్కారువారి పాట". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. మొత్తం 162 నిమిషాల 25 సెకన్ల రన్నింగ్ సమయం. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ  చిత్రంలోని పాటలకు ఇప్పటికే విశేష స్పందన వచ్చింది. ఎస్. థమన్ సంగీతం అందించారు.