శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (16:01 IST)

శతమానం భవతి రొమాంటిక్ సాంగ్ రిలీజ్... జనవరి 14న సినిమా రిలీజ్

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా శతమానం భవతి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహిస్తున్నాడు.

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా శతమానం భవతి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పల్లెటూరి అనుబంధాల్ని, అక్కడి అల్లరిని గుర్తు చేసే చిత్రంలా 'శతమానం భవతి'ని తీర్చిదిద్దారు. మిక్కీ జె.మేయర్‌ అందించిన స్వరాలకు ఇప్పటికే చక్కటి ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు చెందిన ఓ రొమాంటిక్ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ఇదే ఊపులో రొమాంటిక్ సాంగ్‌ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని సినీ యూనిట్ భావిస్తోంది. ''నాలో నేను అనే రొమాంటిక్ సాంగ్‌''ని తనదైన శైలిలో చిత్రీకరించాడు దర్శకుడు. పాటకు తగినట్టుగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నటిస్తున్నట్లు తెలిసిందే. ఈ విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'అమ్మాయిలను ఇంప్రెస్‌ చేస్తే పడరు. వాళ్లు ఇంప్రెస్‌ అయితే పడతారు' 'మన సంతోషాన్ని పది మందితో పంచుకుంటే బాగుంటుంది కానీ, మన బాధను పంచి వాళ్లను కూడా బాధ పెట్టడం ఎందుకు' 'ప్రేమించిన మనిషిని వదులుకోవడం అంటే ప్రేమను వదులుకోవడం కాదు' అంటూ శర్వానంద్‌ పలికిన డైలాగ్‌లపై ఇప్పటికే నెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. పాటకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.