'ఓం నమో వేంకటేశాయ': అమ్మవారి పాత్రలో విమల, శ్రీవారి పాత్రకు సౌరభ్ రాజ్ జైన్!?
నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. వేంకటేశ్వరస్వామికి ప్రియభక్తుడైన హథీరాం బావాజీ' జీవిత చరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం అనుష్క.. ప్రగ్యా జైస్వ
నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. వేంకటేశ్వరస్వామికి ప్రియభక్తుడైన హథీరాం బావాజీ' జీవిత చరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం అనుష్క.. ప్రగ్యా జైస్వాల్.. విమలా రామన్‌ను ఎంపికైనట్లుగా ప్రచారం సాగింది. ఈ ముగ్గురిలో శ్రీదేవి అమ్మవారి పాత్ర కోసం విమలా రామన్‌ను తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఇక వేంకటేశ్వరస్వామిగా సుమన్‌ని తీసుకుంటారనే వార్త తొలి నాళ్లలో వినిపించింది. ఎందుకంటే 'అన్నమయ్య'లో ఆయన స్వామివారి పాత్రకి నిండుదనాన్ని తీసుకొచ్చాడు. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, స్వామివారి పాత్రకి 'సౌరభ్ రాజ్ జైన్'ను ఎంపిక చేశారట. హిందీ 'మహాభారతం'లో శ్రీ కష్ణుడిగా, 'హరహర మహేదేవ'లో విష్ణుమూర్తిగా ఆయన నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.