శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:01 IST)

ప్రేమ గురించి సీతారామం హీరోయిన్ ఏం చెప్పిందంటే?

mrunal thakur
సీతారామం హీరోయిన్ మృణాల్ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అంతేకాదు సాధారణంగా తన వయస్సు ఎంత ? అని ప్రజలు తనను అడుగుతారని.. తన వయసు 30 ఏళ్లు అని చెప్పగానే వెంటనే పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తారని చెప్పుకొచ్చింది. 
 
అంతేకాదు అలాగే 20 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు.. 30 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది. ఇకపోతే 20 ఏళ్లలో ప్రాథమిక విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోరని.. ఆ వయసులో ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే.. మనం కూడా ప్రేమిస్తామని.. కానీ 30 ఏళ్ల వయసులో ఆ వ్యక్తిని నేను ఎక్కువగా ప్రేమించాలని.. ఇక అతను మనకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటామని తెలిపింది.