నేటి సినిమాలు చూసి రోడ్‌సైడ్ రోమియోలు పుట్టుకొస్తున్నారు: నటి జమున
నేటి సినిమాలపై నటి జమున ఘాటైన విమర్శలు చేశారు. నాడు ‘భక్త పోతన’ సినిమా చూసి ఒక బాలయోగి జనిస్తే, నేటి సినిమాలు చూసి రోడ్‌సైడ్ రోమియోలు పుట్టుకొస్తున్నారన్నారు.
నేటి సినిమాలపై నటి జమున ఘాటైన విమర్శలు చేశారు. నాడు ‘భక్త పోతన’ సినిమా చూసి ఒక బాలయోగి జనిస్తే, నేటి సినిమాలు చూసి రోడ్‌సైడ్ రోమియోలు పుట్టుకొస్తున్నారన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని నందమూరి తారక రామారావు కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి తొమ్మిదో నాటకోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ అవార్డును ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో చెడును ఎక్కువగా చూపిస్తున్నారని, దీంతో, యువత చెడుమార్గంలో నడుస్తోందన్నారు.
తెలుగు సినిమాల్లో చోటుచేసుకున్న మార్పులు సమాజానికి మంచిని చేసేవి కావన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక స్తబ్ధత నెలకొని ఉందని, ఔత్సాహికులకే కాదు, వృత్తి కళాకారులకు సైతం ఎలాంటి ప్రోత్సాహకాలు అందట్లేదని అన్నారు.