మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 5 జులై 2016 (20:35 IST)

హాస్య నటుడు అలీని బహిరంగంగా చీవాట్లు పెట్టిన హీరోయిన్... గుడ్లు మిటకరించిన అలీ...

హాస్య నటుడు అలీ యాంకరింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆమధ్య అనుష్క తొడ కొడితే... అంటూ అనుష్క తొడపై కామెంట్లు చేసి బాగా ఇరుక్కుపోయాడు. దానిపై తీవ్రమైన దుమారం చెలరేగినప్పటికీ.... వెనక్కి తగ్గలేదు అ

హాస్య నటుడు అలీ యాంకరింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆమధ్య అనుష్క తొడ కొడితే... అంటూ అనుష్క తొడపై కామెంట్లు చేసి బాగా ఇరుక్కుపోయాడు. దానిపై తీవ్రమైన దుమారం చెలరేగినప్పటికీ.... వెనక్కి తగ్గలేదు అలీ. అనుష్క తను వేసిన కామెంట్లు కామెడీగా తీసుకున్నారంటూ చెప్పారు కూడా. ఐతే ఆ తర్వాత ఎందుకొచ్చిన తంటా... నేను జాగ్రత్తగా ఉంటా అంటూ చెప్పారు. ఆ తర్వాత కూడా యాంకర్ సుమ, మరో యాంకర్ శ్యామల పైన కుళ్లు జోకులు వేసి బుక్ అయ్యాడు.
 
అందుకే అలీ యాంకరింగ్ అంటే తోటి మహిళా యాంకర్లు భయపడే స్టేజి వచ్చేసింది. తాజాగా సైమా 2016 అవార్డు వేడుకల్లో సీనియర్ హీరోయిన్ సుహాసిని అలీ చేసే కామెంట్లపైన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ... అలీ కామెడీ చాలా బాగుంటుంది. ఆయన కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ చిన్నపిల్లలు, మహిళలపై అలీ చేసే వల్గర్ కామెడీ చెత్తగా ఉంటుంది అని ఆమె అనేసరికి అక్కడివారంతా షాక్ చెందారు. అలీ గుడ్లు మిటకరించి అలా చూస్తుండిపోయారట.