సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (18:27 IST)

మాస్ మహారాజా సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరు?

Rashi Khanna, Pakka Commercial,
రవితేజ హీరోగా డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన గోపీచంద్ మలినేనితో మాస్ మహారాజా రవితేజ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరనే వార్త వైరల్ అవుతోంది.
 
ఈ సినిమాలో రవితేజ సరసన రాశి ఖన్నా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటి వరకు ఈ వార్తపై అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.