సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (17:17 IST)

విడుద‌ల‌కు సిద్దమైన శివ కందుకూరి భూతద్ధం భాస్కర్‌ నారాయణ

Shiva Kandukuri, Rashi Singh, Arun
Shiva Kandukuri, Rashi Singh, Arun
శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ ని  ద‌ర్శ‌కుడిగా  పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మించిన చిత్రమే "భూతద్ధం భాస్కర్‌ నారాయణ". ఈ చిత్రం మొద‌టిలుక్ నుండి రీసెంట్ గా విడుద‌ల చేసిన మొష‌న్ పోస్ట‌ర్ వ‌ర‌కూ సినిమా కాన్సెప్ట్ ని ఇన్‌స‌ర్ట్ చేసి వైవిధ్యం గా ప్రెజెంటేష‌న్ చేశారు నిర్మాత‌లు.
 
ఈ చిత్రానికి సంభందించిన ప్ర‌తి ప్ర‌మోష‌న్ మెటీరియ‌ల్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని మార్చి 31, 2023 న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. దీనికి కూడా చిన్న మోషన్ పోస్ట‌ర్ తో డేట్ ఎనౌన్స్ చేస్తారు.  ఈ చిత్రం లో ఏ స‌న్నివేశాన్ని ముందుగా ఊహించడం చాలా క‌ష్టం గా వుండేలా ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లే వుంటుంది. ఈ చిత్రానికి సంభందించి మ‌రిన్ని అప్‌డేట్స్ సంక్రాంతి సీజ‌న్ తరువాత ప్రేక్ష‌కుల‌కి అందిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.
  ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జ‌రుగుతున్నాయి.
 
నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్‌, అరుణ్‌, దేవీప్రసాద్‌, వర్షిణి, శివకుమార్‌, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్‌ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్‌, కమల్‌, గురురాజ్‌ తదితరులు
 
రచన-దర్శకత్వం: పురుషోత్తం రాజ్‌, నిర్మాతలు: స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై,  సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: గౌతమ్‌ జి, ఎడిటర్‌: గ్యారీ బిహెచ్‌, స్టంట్స్‌: వింగ్ చున్ అంజి, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్‌