శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 మే 2023 (17:25 IST)

ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకోవాలి : శ్రీలీల

nati srileela
nati srileela
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో నటి శ్రీలీల భాగమైనందుకు గౌరవంగా భావిస్తోంది. మే 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖుల్లో శ్రీలీల ఒకరు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
 
యోగా యొక్క అద్భుతమైన ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి నటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకోవాలి అని సూచించారు.  అందులో యోగ సంజీవని లాంటిదని శ్రీలీల అన్నారు. 
 
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఫిట్‌నెస్‌పై ఆసక్తి కలిగి ఉంది. త్వరలో డాక్టర్ కాబోతున్న శ్రీలీల ప్రతిరోజూ ఏదో ఒక విధంగా వ్యాయామం చేసేలా చూసుకుంటుంది.