మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (10:22 IST)

కమల్ హాసన్‌తో శ్రుతిహాసన్-మైఖేల్.. పంచెకట్టులో కాబోయే అల్లుడు

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తెలో లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం జరిపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న శ్రుతిహాసన్ తల్లి సారికకు బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసినట్లు ఫోటోలు లీకైయ్యా

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తెలో లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం జరిపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న శ్రుతిహాసన్ తల్లి సారికకు బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసినట్లు ఫోటోలు లీకైయ్యాయి. తాజాగా తమిళ దిగ్గజ రచయిత కవి అరసు కన్నదాసన్ మనవడు, నటుడు ఆదవ్ వివాహా వేడుకకు మైఖేల్‌తో కలిసి శ్రుతిహాసన్ వచ్చింది. 
 
శ్రుతితో ఆయన తండ్రి కమల్ హాసన్ కూడా వచ్చారు. ఆదవ్ వివాహ వేడుకకు సినీ తారలంతా దిగొచ్చిన వేళ శ్రుతి తన లవర్‌తో వచ్చి అందరికీ షాకిచ్చింది. తన తండ్రికి కూడా మైఖేల్‌ను ఇప్పటికే పరిచయం చేసేసిన శ్రుతిహాసన్, ఈ పెళ్లి వేడుకకు హాజరైన సినీ ప్రముఖులందరికీ తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిందని సమాచారం. 
 
కాగా శ్రుతి బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్ ఆదవ్ వివాహ వేడుకకు పంచెకట్టులో తమిళ తంబిలా ఆకట్టుకున్నాడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయ్యాయి.