శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (09:58 IST)

పోలీస్ గెటప్‌లో స్టెప్పులు అదరగొట్టిన శ్రుతిహాసన్!

అందాల భామ శ్రుతిహాసన్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శ్రుతిహాసన్ అనగనగ ఒక ధీరుడు‌తో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. గబ్బర్ సింగ్‌తో మంచి మంచి ఆఫర్లను అందుకుంది. తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అదరగొట్టింది. 
 
అయితే ఈ మధ్య చిన్న గ్యాప్ ఇచ్చింది శ్రుతి. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్‌తో మరో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రవితేజ కూడా చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డిలో శ్రుతిహాసన్ నటిస్తోంది. 
 
అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్యలో చేస్తోంది. అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్‌లో నటిస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో శ్రుతిహాసన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ అమ్మడు నటనతో పాటు సింగర్ అన్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది ఈ అందాల భామ.
 
ఈ వీడియోలో పోలీస్ గెటప్‌లో కనిపించిన శ్రుతి.. అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ చేస్తూ ఆకట్టుకుంది. ఈ వీడియో క్రాక్ టైమ్ లోనిదని తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.