మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 15 సెప్టెంబరు 2018 (15:55 IST)

సైమా వేడుకలు.. బాహుబలికి అత్యధిక అవార్డులు..

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది సినీ తారలంతా ఈ పండుగకు హాజరు కానున్నారు. నటీమ‌ణుల గ్లామ‌ర్‌తో, రాక

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది సినీ తారలంతా ఈ పండుగకు హాజరు కానున్నారు. నటీమ‌ణుల గ్లామ‌ర్‌తో, రాక్ ప‌ర్ఫార్మెన్స్‌తో, సెల‌బ్రిటీల ఆట పాట‌ల‌తో సైమా వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు ఎడిష‌న్స్ పూర్తి చేసుకున్న సైమా ఈ ఏడాది దుబాయ్‌లో ఏడో ఎడిష‌న్ జ‌రుపుకుంటుంది. 
 
సెప్టెంబ‌ర్ 14, 15వ తేదీల‌లో సైమా వేడుకని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. తొలి రోజు టాలీవుడ్‌, కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ల‌కి సంబంధించిన విజేత‌ల‌ని ప్ర‌క‌టించారు. 2017 సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల‌కి సంబంధించి ఈ అవార్డుల‌ని అందించారు. 
 
ఇక ప్రపంచ సినీ ప్రజలను టాలీవుడ్ తిరిగి చూసేలా చేసిన ''బాహుబలి: ది కన్‌క్లూజన్‌" సినిమాకు ఏకంగా 12 విభాగాల్లో నామినేషన్లు దక్కాయి. తద్వారా బాహుబలికే అత్యధిక అవార్డులు దక్కాయి. ఇక లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌ను ప్రముఖ గాయని పి.సుశీల‌కు నందమూరి హీరో బాల‌య్య అందించారు.
 
అవార్డుల సంగతికి వస్తే..
టాలీవుడ్.. 
ఉత్త‌మ చిత్రం - బాహుబ‌లి 2 
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - రాజ‌మౌళి (బాహుబ‌లి 2)
ఉత్త‌మ హీరో - ప్ర‌భాస్ (బాహుబ‌లి 2)
ఉత్త‌మ హీరోయిన్‌- కాజ‌ల్ (నేనే రాజు నేనే మంత్రి)
ఉత్త‌మ స‌హాయ న‌టుడు - ఆది (నిన్ను కోరి)
ఉత్త‌మ స‌హాయ న‌టి - భూమిక (ఎంసీఏ)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - ఎంఎం కీర‌వాణి (బాహుబ‌లి 2)
ఉత్త‌మ గాయ‌ని - మ‌ధుప్రియ (ఫిదా)
ఉత్త‌మ గాయ‌కుడు - కాల భైర‌వ (బాహుబ‌లి 2)
ఉత్త‌మ విల‌న్ - రానా (బాహుబ‌లి-2)
ఉత్త‌మ డెబ్యూ డైరెక్ట‌ర్ - సందీప్ వంగా (అర్జున్ రెడ్డి)
ఉత్తమ డెబ్యూ యాక్ట‌ర్ - ఇషాన్ (రోగ్‌)
ఉత్తమ లిరిక్ రైట‌ర్ - సుద్ధాల అశోక్ తేజ (ఫిదా)
బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ - క‌ళ్యాణి ప్రియద‌ర్శ‌న్ (హ‌లో)
బెస్ట్ క‌మెడీయ‌న్ - రాహుల్ రామ‌కృష్ణ (అర్జున్ రెడ్డి)
బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ - సెంథిల్ కుమార్ (బాహుబ‌లి 2)
ఎంట‌ర్‌టైన‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ - రానా (బాహుబ‌లి 2, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి)
బెస్ట్ యాక్ట్రెస్ లీడింగ్ రోల్ క్రిటిక్స్ - రితికా సింగ్ (గురు)
బెస్ట్ యాక్ట‌ర్ లీడింగ్ రోల్ క్రిటిక్స్ - బాల‌కృష్ణ (గౌత‌మి పుత్ర శాత‌కర్ణి)
ఉత్త‌మ చిత్రం (క్రిటిక్స్)-గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి
 
కోలీవుడ్ అవార్డ్స్ విషయానికి వస్తే.. 
ఉత్త‌మ చిత్రం - విక్ర‌మ్ వేద‌
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - అట్లీ ( మెర్స‌ల్‌)
ఉత్త‌మ హీరో - శివ కార్తికేయ‌న్‌
ఉత్త‌మ హీరోయిన్‌- న‌య‌న‌తార‌
ఉత్త‌మ స‌హాయ న‌టుడు - ఎంఎస్ భాస్క‌ర్
ఉత్త‌మ స‌హాయ న‌టి - శివ‌ద‌
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - ఏ ఆర్ రెహ‌మాన్
ఉత్త‌మ గాయ‌ని - లుక్సిమి శివ‌నేశ్వ‌రి
ఉత్త‌మ గాయ‌కుడు - సిద్ శ్రీరామ్‌
ఉత్త‌మ విల‌న్ - ఎస్‌జే సూర్య‌ ఎంపికయ్యారు.