శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (20:35 IST)

విక్రమ్, హరిల ‘సామి’ సెప్టెంబర్ 3వ వారంలో విడుదల

‘సామి’ మళ్లీ వస్తున్నాడు. పదిహేనేళ్ల కిందట తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది ‘సామి’. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి స్క్వేర్’ను రూపొందించారు. ఈ చిత్రం తెలుగులో ‘సామి’ అనే టైటిల్‌తో సెప్టెంబర్ మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు రా

‘సామి’ మళ్లీ వస్తున్నాడు. పదిహేనేళ్ల కిందట తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది ‘సామి’. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి స్క్వేర్’ను రూపొందించారు. ఈ చిత్రం తెలుగులో ‘సామి’ అనే టైటిల్‌తో సెప్టెంబర్ మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్ హీరోగా, ‘సింగం, సింగం 2, సింగం 3, పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సామి’. 
 
శిబు థామీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు తదితరులు ఇతర పాత్రలలో నటించారు. పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు రెడీగా ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నారు.
 ఈ సందర్భంగా నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 
 
మా దర్శకుడు, హీరోలైన హరి, విక్రమ్‌ల కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. వాళ్లిద్దరిదీ పవర్‌ఫుల్ కాంబినేషన్. 15 సంవత్సరాల క్రితం వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామి’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘సామి స్క్వేర్’ చిత్రాన్ని తెలుగులో ‘సామి’గా విడుదల చేస్తున్నాము. విక్రమ్ సరసన ‘మహానటి’ కీర్తిసురేష్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అలవోకగా అందుకుంటుంది. 
 
ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ అటువంటిది. రాక్‌స్టార్ దేవిశ్రీ మ్యూజిక్, ప్రియన్-వెంకటేష్ అంగురాజ్‌ల సినిమాటోగ్రఫీ, కనల్ కణ్ణన్ ఫైట్స్.. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ప్రస్తుతం సెన్సార్‌కు వెళుతున్న ఈ  పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని సెప్టెంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ఈ చిత్రం కూడా అందరినీ మెప్పించి, అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని ఎంతో నమ్మకంతో ఉన్నాము’’ అన్నారు.