శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 5 ఆగస్టు 2017 (18:12 IST)

మరో మహిళతో అక్రమ సంబంధం... నన్ను బూతులు తిట్టేవాడు... తెలుగు గాయని ఆవేదన...

రా.. రమ్మని... రారా రమ్మని... అనే పాటతో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో ఓ స్వీట్ వాయిస్ పలుకరిస్తుంది. ఆ పాటనే కాదు... ఇడియట్, శివమణి... ఇలా చక్రి సంగీత సారథ్యంలో పాటలు పాడిన గాయని కౌసల్య. చక్రి మరణం తర్వాత ఆమెకు పెద్దగా ఛాన్సులు రావడం లేదట. ద

రా.. రమ్మని... రారా రమ్మని... అనే పాటతో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో ఓ స్వీట్ వాయిస్ పలుకరిస్తుంది. ఆ పాటనే కాదు... ఇడియట్, శివమణి... ఇలా చక్రి సంగీత సారథ్యంలో పాటలు పాడిన గాయని కౌసల్య. చక్రి మరణం తర్వాత ఆమెకు పెద్దగా ఛాన్సులు రావడం లేదట. దానితో ప్రస్తుతం స్టేజి షోలు, టెలివిజన్ కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుబండి నెట్టుకొస్తుంది. 
 
కౌసల్య వైవాహిక బంధంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. తన భర్త ఓ శాడిస్ట్ అనీ, తనను నిత్యం హింసిస్తూ బూతులు తిడుతూ భౌతికంగా హింసించేవాడని తెలిపింది. అంతేకాకుండా తను మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడనీ, దాంతో వేధింపులు మరింత ఎక్కువ కావడంతో విడాకులు తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా మాజీ భర్తతో చాలా రోజులు సమస్యలు ఎదుర్కొన్నాననీ, చివరకి ఇప్పుడిప్పుడే తను కాస్త ప్రశాంతంగా వున్నట్లు చెప్పుకొచ్చారు.