బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (11:12 IST)

రామాయణాన్ని ఆధారంగా విలువలు తెలియజేసే కథతో సీతా కళ్యాణ వైభోగమే

Suman Tej  Garima Chauhan  Satish Paraveda Gagan Vihari
Suman Tej Garima Chauhan Satish Paraveda Gagan Vihari
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు పలు విషయాలు తెలిపారు.
 
సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘కొత్త హీరోని నమ్మి సినిమా తీయడం అంత ఈజీగా కాదు. మా మీద నమ్మకంతో చిత్రాన్ని తీసిన నిర్మాత రాచాల యుగంధర్ గారికి థాంక్స్. గరీమ చౌహాన్ చక్కగా నటించారు. మా దర్శకుడు సతీష్  అన్ని అంశాలను కలగలపి మంచి కమర్షియల్ సినిమాను తీశారు. గగన్ విహారి  చాలా వైల్డ్‌గా నటించారు. సంగీతం, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. మా ఫ్యాషన్ పార్ట్నర్స్ అయిన నీరుస్‌కు థాంక్స్. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరారు.
 
గరీమ చౌహాన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమకు థాంక్స్. నాకు ఇదే మొదటి చిత్రం. ఇక్కడ అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమా ఇది. మా మూవీని చూసి అందరూ ఆదరించండి’ అని అన్నారు.
 
దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ఊరికి ఉత్తరాన. ఆ చిత్రానికి కూడా యుగంధర్ సహ నిర్మాత. మళ్లీ ఆయనతోనే రెండో సినిమాను తీయడం ఆనందంగా ఉంది. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మళ్లీ మన విలువలు, సంప్రదాయాన్ని అందరికీ చూపించాలానే ఉద్దేశంతో ఈ సినిమాను తీశాను. మర్చిపోతోన్న విలువల్ని అందరికీ గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుంది. చాలా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు’అని అన్నారు.
 
నిర్మాత రాచాల యుగంధర్ మాట్లాడుతూ, ఈ సినిమాలో యాక్షన్, లవ్, కుటుంబ విలువలు అన్నీ కలగలపి తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. సుమన్ తేజ్, గరిమ చౌహాన్ కొత్త వాళ్లైనా అద్భుతంగా నటించారు. ధర్మపురి హీరో గగన్ విహారి ఈ సినిమాలో విలన్‌గా చక్కగా నటించారు. వందల మందితో పాటలు, ఫైట్లను భారీ ఎత్తున తీశాం. నీరుస్ యాజమాన్యం మాతో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉంది. మీడియా మాకు ముందు నుంచీ సహకారం అందిస్తోంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
గగన్ విహారి మాట్లాడుతూ.. ‘ధర్మపురితో హీరోగా నాకు మంచి పేరు వచ్చింది. దర్శకుడు సతీష్ గారు సీతా కళ్యాణ వైభోగమే కథ చెప్పారు. టైటిల్ వింటేనే ఎంతో హాయిగా అనిపించింది. రాముడు, సీత అనే కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రాన్ని తీశారు. ఇందులో నేను చాలా వైల్డ్‌గా కనిపిస్తాను. మా చిత్రాన్ని ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.
 
ఈసినిమాకు  సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, కెమెరామెన్ పరుశురామ్, ఎడిటర్ డి. వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలకి విజయ్ పనిచేస్తున్నారు.