ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:36 IST)

'బిగ్ బాస్' వైల్డ్ కార్డ్‌తో కొలనులోకి దీక్షా పంత్... వెర్రి ముఖమేసుకుని శివబాలాజీ

మొత్తానికి ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ తెలుగును కాస్త లైమ్ లైట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు బాగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దీక్షా పంత్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది. అలా వస్తూనే ఈ ముద్దుగుమ్మ కొలనులో దిగేసి రెండ

మొత్తానికి ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ తెలుగును కాస్త లైమ్ లైట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు బాగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దీక్షా పంత్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది. అలా వస్తూనే ఈ ముద్దుగుమ్మ కొలనులో దిగేసి రెండు చేతులు పైకెత్తి కేరింతలు కొడుతుంటే అప్పటికే చింపిరి జుట్టుతో బిగ్ బాస్ హౌసులో వున్న శివబాలాజీ ఆమెను వెర్రిముఖం వేసుకుని కళ్లార్పకుండా అలా చూస్తుండిపోయాడు. 
 
ఇక మిగిలినవారు కూడా ఎవరి రేంజిలో వారు తమ నటను పండించేశారు. మొత్తమ్మీద బిగ్ బాస్ హౌసులోకి హాట్ భామ రావడంతో కాస్తంత ఊపు అయితే వచ్చేసింది. మరి షో చివరి దశకు చేరుకునేసరికి ఇంకెంతమంది హాట్ హీరోయిన్లు వస్తారో చూడాలి.