గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (15:39 IST)

స్లమ్ డాగ్ హజ్బెండ్ సూపర్ హిట్ కావాలి : హీరోయిన్ శ్రీలీల

Sludaog pre release
Sludaog pre release
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది.  మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్స్ బాబీ, బుచ్చి బాబు సానా, కార్తీక్ దండు, స్టార్ హీరోయిన్ శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు. 
 
దర్శకుడు బాబీ మాట్లాడుతూ - అప్పిరెడ్డి గారు  సినిమాలకు సెలెక్ట్ చేసుకునే కంటెంట్ బాగుంటుంది. జార్జిరెడ్డి సినిమాను థియేటర్ లో చూశాను. చాలా బజ్ క్రియేట్ చేశారు ఆ సినిమాకు. దర్శకుడు శ్రీధర్  గారు పూరి జగన్నాథ్ గారికి ఇష్టమైన వ్యక్తి. ఇవాళ పూరి గారు కూడా రావాల్సింది ఆయన షూటింగ్ లో ఉండి రాలేకపోయారు. బ్రహ్మాజీ మంచి తనం పెంచుకుంటూ ఏజ్ ను ఎప్పుడో ఆపేసుకున్నారు. పవర్ సినిమా టైమ్ లో ఒక ఇబ్బందికర సందర్భంలో నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. సంజయ్ మంచి యాక్టర్. ఈ సినిమా అతనికి హిట్ తెచ్చిపెట్టాలి. అలాగే ప్రణవి తెలుగమ్మాయి. మా సర్దార్ గబ్బర్ సింగ్ లో చిన్న క్యారెక్టర్ చేసింది. వీళ్లందరికీ ఈ సినిమా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు
 
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ - భగవంత్ కేసరిలో బ్రహ్మాజీ గారు, మేము సీన్స్ చేస్తున్నప్పుడే ఈ సినిమా గురించి తెలిసింది. వాళ్ల అబ్బాయి సంజయ్ హీరోగా నటిస్తున్నారు. బ్రహ్మాజీ గారిలాగే మంచి పర్మార్మెన్స్ చేసి ఉంటారు. ప్రణవి తెలుగు అమ్మాయి. ఇదొక గౌరవం ఉన్న ఇండస్ట్రీ. మన హద్దుల్లో మనం ఉండి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే అడ్డేదీ ఉండదు. ఎలాంటి ఇబ్బందులు రావు. ప్రణవికి నేను ఇచ్చే సలహా ఇదే. భీమ్స్ ధమాకా తర్వాత మళ్లీ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. సినిమా సూపర్ హిట్ కావాలి. అన్నారు.