1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (19:00 IST)

యూట్యూబర్స్ నెగిటివ్ కామెంట్స్ పై సోహైల్ మండిపాటు

Syed Sohail Rian
Syed Sohail Rian
యూట్యూబర్స్ నెగిటివ్ కామెంట్స్ హీరో సోహైల్ మండిపడ్డారు. సహజంగా సినిమా చూసి రివ్యూలు రాసేవారు, చెప్పేవారు వేరే ఉన్నారు. కానీ కొత్తగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొందరు అదేపనిగా నెగిటివ్ కామెంట్స్ పెట్టి సినిమాను కిల్ చేస్తున్నారు. సినిమా విడుదల అయినా మూడు రోజుల తర్వాత మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టావచ్చు. ఇటీవలే కొందరు యూట్యూబర్స్ రజనీకాంత్ సినిమా జైలర్ కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఆనంద పడ్డారు.. కానీ ఆ సినిమా 300 కోట్ల క్లబ్ లే చేరింది. అంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు. 
 
సయ్యద్ సోహైల్ రియాన్,  రూపా కొడవాయుర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈరోజు సక్సెస్ మీటి లో ఆయన మాట్లాడారు. నేను పదహారేళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు వచ్చిన ప్రతి రివ్యూలో సోహైల్ బాగా నటించాడని రాశారు. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉంది. సిటీలో మల్టీఫ్లెక్స్ వెళ్లి చూశా. సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు బాగా నటించావు అంటూ హగ్ చేసుకుంటున్నారు. ఒక మంచి సినిమా చేశామని చెబుతున్నారు. పబ్లిక్ టాక్ వినండి.. ఏ ఒక్కరూ నెగిటివ్ గా చెప్పలేదు. అక్కడే మేము సక్సెస్ అయ్యాం. యూట్యూబ్ లో కొందరు స్పాయిలర్స్ సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి సినిమా రిలీజైన వెంటనే ఆ సినిమాను దెబ్బతీసే వీడియోలు చేయకండి. మీ వల్ల సినిమా కోసం పనిచేసే ఎంతోమంది నష్టపోతారని గుర్తుపెట్టుకోండి. అన్నారు.
 
సయ్యద్ సోహైల్ రియాన్,  రూపా కొడవాయుర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించారు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించిన ఈ సినిమా నిన్న (శుక్రవారం) థియేటర్ లలో రిలీజైంది. ఎమోషన్ ఎంటర్ ఫ్లస్ టైన్ మెంట్ కలిసి తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్ర బృందం.