స్నేహితులే "ఆ" విషయాలు నేర్పించారు : సోనాక్షి సిన్హా

sonakshi sinha
Last Updated: గురువారం, 1 ఆగస్టు 2019 (17:41 IST)
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. ప్రతి విషయంపై ఓపెన్‌గా తన భావాలను వ్యక్తం చేస్తోంది. తాజాగా ఆమె శృంగారం గురించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. 'దంబాంగ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాక్షి... 'ఖందానీ సఫాఖానా' అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో సెక్స్ క్లినిక్‌ని నడిపే మహిళగా సోనాక్షి నటిస్తోంది.

ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోనాక్షి మాట్లాడుతూ, కథాపరంగా ఈ చిత్రంలో సెక్స్ క్లినిక్ నడిపే మహిళగా నటించినట్టు చెప్పారు. అయితే, శృంగార విషయాలపై తనకు పెద్దగా అవగాహన లేదన్నారు. కానీ, ఈ విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరగలేదన్నారు. తన తండ్రిగారితో కూడా ఈ విషయాలపై చర్చించలేదన్నారు.

కానీ, శృంగార విషయాలన్ని తన స్నేహితుల వద్ద నుంచే తెలుసుకోవడం జరిగిందన్నారు. దేశంలోని ఉన్న పిల్లలంతా కూడా ఇదే విధంగా చేస్తారన్నారు. అయితే, ఈ పద్ధతికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సెక్స్ విషయాలపై తల్లిదండ్రులే తమ పిల్లల వద్ద చర్చించాలన్నారు. అపుడే వారికే శృంగారంపై మంచి అవగాహన కలుగుతుందన్నారు. ఇతరుల ద్వారా వచ్చిన శృంగార విజ్ఞానంతో పిల్లలు చెడిపోయే ఆస్కారం ఉందని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది.దీనిపై మరింత చదవండి :