సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (12:05 IST)

పార్లమెంట్‌కు నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు.. చాణక్య నీతిని గుర్తుచేస్తూ...?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుమార్తె బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని చూసేందుకు వీలుగా ఆమె తల్లిదండ్రులు నారాయణ్ సీతారామన్, సావిత్రి సీతారామన్‌లు పార్లమెంటుకు చేరుకున్నారు. వీరు గ్యాలరీలో కూర్చుని బడ్జెట్‌ను వీక్షిస్తున్నారు. 
 
ఇకపోతే.. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ప్రసంగిస్తూ చాణక్య నీతిని ప్రస్తావించారు. "కార్య పురుష కరేన..లక్ష్యం సంపాదయతే" అని చాణక్య నీతి చెబుతోంది. అంటే మానవ ప్రయత్నం కచ్చితంగా ఉంటే ఎలాంటి లక్ష్యాలనైనా పూర్తి చేయగలం అని అర్థం’ అని సీతారామ్‌ చెప్పారు. తమ ప్రభుత్వం దేశ వృద్ధికి కట్టుబడి ఉందన్నారు.
 
గత ఐదేళ్లలో దేశం వేగంగా అభివృద్ధి చెందిందని నిర్మలా సీతారామన్ అన్నారు. మనదేశ ఆర్థిక వ్యవస్థ.. ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరడానికి 55ఏళ్లు పట్టింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 1.85లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష కోట్ల డాలర్లు పెంచామని చెప్పుకొచ్చారు. 
 
ఈ ఏడాది చివరి నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుని.. త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా దేశం ఎదుగుతుంది. ఇందుకోసం వడివడిగా అడుగులు వేస్తున్నాం. తక్కువ ప్రభుత్వం.. ఎక్కువ పాలనే మా విధానమని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
 
ఇక బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 
మీడియా, యానిమేషన్‌, విమానయాన రంగంలో ఎఫ్‌డీఐలపై పరిశీలన
2022 అన్ని నివాసాలకు విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా
1.25లక్షల కి.మీ. మేర రహదారుల ఆధునీకీకరణ
జీరో బడ్జెట్‌ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం) ప్రవేశపెడుతున్నాం. ఇందుకోసం ఇప్పటికే రైతులకు శిక్షణ
జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ. ''హర్‌ ఘర్‌ జల్‌'' పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.