శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (11:39 IST)

#Budget2019 బ్రీఫ్ కేస్ కాదు.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలతో.. సీతారామన్

ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. బ్రిటిష్‌ కాలం నాటి సంప్రదాయాన్ని పక్కనబెట్టి బ్రీఫ్‌ కేస్‌కు బదులుగా ఎర్రటి వస్త్రంలో బడ్జెట్‌ పత్రాలను తీసుకొస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆమె చాటి చెప్పారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో..  గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశామని చెప్పారు.
 
పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం భారత్‌ 2.5లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారిందని చెప్పుకొచ్చారు. 
 
ఒకే దేశం.. ఒకే గ్రిడ్‌ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. 
 
* నవీన భారత రూప కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం. 
* 2014-15తో పోలిస్తే, ఆహార భద్రతకు రెట్టింపు నిధులు 
* 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపునకు దూసుకెళ్తున్నాం
* రైల్వేల్లో 50లక్షల కోట్ల పెట్టుబడి అవసరముంది. దీని కోసమే పీపీపీ అమలు చేస్తున్నాం
* మౌలికవసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. 

 
* భారత్ మాల కార్యక్రమంలో రోడ్లు, సాగర్ మాల సాయంతో నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నాం
* పౌరుల ఆహార భద్రత కోసం కేటాయిస్తున్న నిధులను రెట్టింపు చేశాం
* చిన్నచిన్న పట్టణాలకు విమానాయాన సౌకర్యం కల్పించేందుకు ‘ఉడాన్’ పథకం తీసుకొచ్చాం 
* ప్రపంచంలోనే భారత్ ఈరోజు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పుకొచ్చారు.