శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (15:08 IST)

చెడ్డ అలవాట్ల మాదిరే చెడ్డవాడిని వదిలించుకోవాలి... బ్రేకింగ్స్‌పై సోనమ్ బ్రేకింగ్ కామెంట్

బాలీవుడ్ హీరోయిన్లు చాలా బోల్డుగా మాట్లాడుతారు గురూ అంటే ఏదో అనుకుంటారు కొంతమంది. కానీ నిజ్జంగా చాలా బోల్డుగా మాట్లాడేస్తారు సుమీ. ఇటీవల వరుసబెట్టి సెలబ్రిటీ కపుల్స్ బ్రేకింగులు(విడాకులు) తీసుకోవడంపై సోనమ్ కపూర్ స్పందించింది. బ్రేకింగ్స్ తీసుకోవడం చాలా మంచిదని చెప్పుకొచ్చింది. 
 
అసలు తన దృష్టిలో బ్రేకింగ్ ద్వారా ఓ వ్యక్తిని వదిలించుకోవడం అనేది మనలో చెడ్డ అలవాట్లను ఎలా వదిలించుకోవాలో అచ్చం అలాంటిదేనంటూ కితాబిస్తోంది. తనకు తెలిసినంత వరకూ ఇష్టం లేని వ్యక్తితో కలిసి జీవించేకంటే చక్కగా వదిలేసి స్వతంత్రంగా జీవించడం చాలా చాలా మంచిదని చెపుతోంది ఈ బాలీవుడ్ భామ.