సంబంధిత వార్తలు
- మా దేవుడు సోనూసూద్ అంటున్న ఆ తండ్రీకూతుళ్లు... ఉత్తరప్రదేశ్ ప్రగ్యాకు నడక దానం
- అజ్ఞాతం వీడిన రియా... రూ.15 కోట్లు ఎవరికిచ్చారంటూ ఈడీ ప్రశ్నలు
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. ఇక సీబీఐకి.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- మీకు దణ్ణం పెడతా, మీ సహాయం నాకు అవసరం లేదన్న చిత్తూరు రైతు, ఎందుకు?
- సోనూసూద్ పుట్టినరోజు కానుక.. 3లక్షల ఉద్యోగాలు..
నెట్ స్పీడ్ సరిగ్గా లేదా? అమ్మాయికి బాగా బుద్ధి చెప్పిన సోనూ..?
కరోనా కాలంలో వలస కార్మికులను గమ్యానికి చేర్చిన బాలీవుడ్ హీరో సోనూ సూద్.. ప్రస్తుతం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న చిత్తూరు రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనిపెట్టారు. దీంతో ఆపదలో ఉన్న వారందరికీ సోనూ సూద్ ఓ దేవుడిలా కనిపిస్తున్నారు. అయిన దానికి కాని దానికి కూడా సహాయం కోరుతూ సరదాగా ఆటపట్టించేవారు కూడా మరి కొందరుంటున్నారు.
తాజాగా ఓ అమ్మాయి తన మొబైల్‌లో ఇంటర్నెట్ స్పీడ్ సరిగా లేదని.. దాన్ని పెరిగేటట్లు చేయమంటూ మంజు శర్మ ట్వీట్ చేసింది. దానికి సోనూ కూడా అంతే సెటైరికల్ సమాధానం చెప్పారు.
రేపు ఉదయం వరకు ఆగండి.. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నా.. ఓ వ్యక్తి కంప్యూటర్ రిపేర్ చేస్తున్నా.. ఇంకా వివాహ సమస్యలు పరిష్కరించడం, ట్రైన్ టికెట్లు బుక్ చేయడం, ఇళ్లకు సంబంధించిన నీటి సమస్యలు తీర్చడం వంటివి. కొంతమంది ఖాళీగా ఉన్న మహానుభావులు నాకిలాంటి గొప్ప గొప్ప పనులు చెబుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి అని మంజూ శర్మకు ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన నెటిజన్లు సోనూ సూద్ చాలా బిజీగా ఉన్నారు అని కామెంట్లు పెడుతున్నారు. భలే స్పందించారండి.. బాగా బుద్ది చెప్పారు అని సోనూని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
