సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (15:23 IST)

"అది గౌరవం కాదు... ప్రేమ" : నెటిజన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్... ఎస్పీ బాలు ఇచ్చిన ఆన్సర్ ఇది!

ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్.బి.బాలసుబ్రమణ్యం ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. అది గౌరవం కాదు.. ప్రేమ కొద్దీ అంటూ ఎంతో వినమ్రంగా సమాధానమిచ్చాడు. ఇంతకీ ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న ఏంట

ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్.బి.బాలసుబ్రమణ్యం ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. అది గౌరవం కాదు.. ప్రేమ కొద్దీ అంటూ ఎంతో వినమ్రంగా సమాధానమిచ్చాడు. ఇంతకీ ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న ఏంటి.. ఎస్పీబీ ఇచ్చిన సమాధానమేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
ప్రస్తుతం అమెరికాలో "ఎస్పీబీ50" పేరుతో గాన విభావరి కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఎస్పీబీ ఫేస్‌బుక్ పేజ్‌లో ఓ కామెంట్ పెట్టాడు. మీరెంత కష్టపడి పైకొచ్చారో తనకు తెలుసని, కానీ మీ విషయంలో ఒక ప్రశ్న తొలిచేస్తుంది. ఎదుటివారి నుంచి ఎప్పుడూ గౌరవాన్ని ఎందుకు అభ్యర్థిస్తారని అడిగాడు. చిరంజీవి మిమ్మల్ని బాలూ గారు అని పిలుస్తారు. కానీ మీరు పలు సందర్భాల్లో మాట్లాడుతూ మిమ్మల్ని చిరంజీవి అన్నయ్య అని పిలవాలని కోరారు. ఎదుటి వారిచ్చే గౌరవం కోసం ఎందుకిలా తాపత్రయపడతారని ఎస్పీ బాలును ప్రశ్నించాడు. అది తనకు నచ్చలేదని కామెంట్ చేశాడు. 
 
ఈ కామెంట్‌కు ఎస్పీ బాలు సమాధానమిచ్చారు. "సార్.. చిరంజీవి నన్ను బాలు గారు అని సంబోధిస్తారు. కానీ గతంలో నన్ను చిరంజీవి అన్నయ్య అని పిలిచేవాడు. ఇప్పుడెందుకు కొత్తగా గారూ అనే పిలుపు... అన్నయ్య అనే పిలవమని కోరాను. నేనలా కోరడం గౌరవం కోసం కాదు. ప్రేమ కొద్దీ" అని బాలు సమాధానమిచ్చారు.