శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:46 IST)

శ్రీదేవి రెండో కుమార్తె కూడా హీరోయిన్ అవుతోందట..!? (video)

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్‌గా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీ కపూర్ కూడా వెండితెరపై కథానాయికగా కనిపించనుంది. గత ఏడాది తాను సినిమాల్లోకి వచ్చానని.. త్వరలో ఖుషీ కపూర్ కూడా వెండితెరపై మెరవనుందని.. జాన్వీ కపూర్ ధ్రువీకరించింది. 
 
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి తన పెద్ద కుమార్తె జాన్వీని దఢక్ సినిమా ద్వారా బాలీవుడ్ తెరంగేట్రం చేయించింది. కానీ ఆ సినిమా రిలీజ్ కాకముందే.. దుబాయ్‌లో బాత్‌టబ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయింది.

ఈ నేపథ్యంలో దఢక్ సినిమా ద్వారా జాన్వీకి మంచి క్రేజ్ లభించింది. ఇంకా కొత్త సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ కూడా హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. 
 
దీనిపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ఖుషీకి నటనపై ఆసక్తి ఎక్కువ. ఇందుకోసం న్యూయార్క్‌లో యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఖుషీని వెండితెరపై చూపెట్టేందుకు తన తండ్రి బోనీ కపూర్ కూడా ఆసక్తిగా వున్నారని.. ఖుషీకి కరణ్ జోహార్ సినిమా ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేయాలనే ఆశ వుందని జాన్వీ చెప్పింది. 
 
సినీ రంగంలో వారసులకు మంచి క్రేజ్ వుందని.. ఇప్పటికే అలియాభట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ వంటి వారిని కరణ్ జోహార్ పరిచయం చేసి అగ్రనటులుగా తీర్చిదిద్దారని జాన్వీ గుర్తు చేసింది. అందుకే ఖుషీ కరణ్ జోహార్ సినిమా ద్వారా పరిచయం కావాలనుకుంటోందని జాన్వీ చెప్పుకొచ్చింది.