జోరుగా ‘శ్రీమంతుడు’ ప్రమోషన్ వర్క్.. 'సెల్వందన్'కు భారీ క్రేజ్..
కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. ఆగస్టు ఏడో తేదిన విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ జోరుగా జరుగుతోంది. ఈ సినిమాను తమిళంలో 'సెల్వందన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలో తెలుగులో నుంచి తమిళంలోకి డబ్బింగ్ అయ్యాయని, అయితే ఇప్పటి వరకూ ఏ సినిమా పొందనంత స్థాయికి క్రేజ్ పొందిందని చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు.
తమిళ వెర్షన్లో కూడా 'శ్రీమంతుడు' బిజినెస్‌కి ఫుల్ క్రేజ్ నెలకొందట. చిత్రం విడుదలకు వారం రోజుల ముందే అక్కడ సెల్వందన్ రైట్స్ అన్నీ అమ్ముడు పోయాయి. ఇప్పటికే సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో మంచి ప్రాఫిట్ లభించింది అని తెలిపారు. మరి అక్కడ ఏ రేంజ్లో సినిమా ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.