గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మార్చి 2024 (12:04 IST)

అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ సంబరాలు.. నాటు నాటు పాటకు స్టెప్పేసిన ఖాన్ త్రయం

natu natu song
దేశ అపర కుబేరుడు, ప్రపంచ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగరంలో అంరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశ, ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అతిథులతో ఆ ప్రాంతమంతా సందడిగా సందడిగా మారింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా హుషారెత్తించి భారత్‌కు ఆస్కార్‌ను తీసుకొచ్చిన పాట 'నాటునాటు'. ఈ పాటకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారక్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ ముగ్గురు కలిసి చిందేశారు. దీంతో సినీ ప్రియులంతా తెగ సంబరపడుతున్నారు. వీరితో ఆర్ఆర్ఆర్ చిత్ర హీరో రామ్ చరణ్ కూడా భాగస్వామి అయ్యాడు.
 
సాధారణంగా బాలీవుడ్‌ టాప్‌ హీరోలు సల్మాన్‌, షారుక్‌, అమీర్‌లు ఒకచోట కలవడం చాలా అరుదు. అలాంటిది ముగ్గురు కలిసి అంబానీ ఈవెంట్‌లో ఫేమస్‌ పాటలకు డ్యాన్స్‌ వేసి అలరించారు. ఇందులో భాగంగానే నాటునాటు స్టెప్‌ వేశారు. ఆతర్వాత వారి సినిమాల్లో పాటల హుక్‌ స్టెప్‌లను రీక్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి. 'ఖాన్స్‌ ముగ్గురితో ఒకే స్టేజ్‌ మీద డ్యాన్స్‌ వేయించడం అంబానీకే సాధ్యం' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. 
 
ఈ బాలీవుడ్‌ స్టార్స్‌ టాలీవుడ్‌ పాటకు చిందేయడంతో తెలుగు ప్రేక్షకులు కూడా 'వావ్‌' అంటున్నారు. ఈ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌కు రామ్‌చరణ్‌ - ఉపాసన హాజరయ్యారు. వీళ్లిద్దరూ ధోనీ దంపతులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లందరూ కలిసి ఈవెంట్‌కు వెళ్తున్న వీడియోను సినీ, క్రీడాభిమానులు షేర్‌ చేస్తున్నారు. సినీ తారలు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, షారుక్‌ఖాన్‌ కుటుంబం, అర్జున్‌ కపూర్‌, ఆలియాభట్‌-రణబీర్‌ కపూర్‌ కుటుంబం, దర్శకుడు అట్లీ తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు.