గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (16:21 IST)

'బాహుబలి' విజయంలో ప్రభాస్ క్రెడిట్ ఏమి లేదు : బాలీవుడ్ దర్శకుడు

"బాహుబలి 2 ది కంక్లూజన్" చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా, రూ.1500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళుతోంది. దీంతో ప్రతి ఒక్క సినీ సెలెబ్రిటీ ఈ చిత్రం విజయంపై ప్రశంసల వర్షం గుప్పిస్తున్నారు. ముఖ

"బాహుబలి 2 ది కంక్లూజన్" చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా, రూ.1500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళుతోంది. దీంతో ప్రతి ఒక్క సినీ సెలెబ్రిటీ ఈ చిత్రం విజయంపై ప్రశంసల వర్షం గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్ర హీరో ప్రభాస్ మాత్రం జాతీయ స్థాయి హీరో రేంజ్‌కు ఎదిగిపోయారు. 
 
ఈనేపథ్యంలో బాలీవుడ్ దర్శక నిర్మాత రోహిత్ శెట్టి స్పందిస్తూ.. బాహుబలి విజయంలో ప్రభాస్ క్రెడిట్ ఏమాత్రం లేదన్నారు. ఈ సినిమా విజయానికి కేవలం కథ, దర్శకత్వం మాత్రమే కారణమని ఆయన తెగేసి చెప్పాడు. ఇందులో నటించిన నటీనటులందరూ సినిమా ఘన విజయం సాధించడానికి కొంత వరకు ఉపయోగపడ్డారే తప్ప... ఇంకేం లేదని అన్నాడు. అదేసమయంలో ఛాన్స్ వస్తే మాత్రం ప్రభాస్‌తో సినిమా తీస్తానని చెప్పారు.