గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 16 డిశెంబరు 2018 (09:11 IST)

రాజమౌళి తనయుడు చిత్రంలో విలన్‌గా సూపర్ స్టార్!

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.కార్తికేయ నిర్మిస్తున్న చిత్రం "ఆకాశవాణి". విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తికేయ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, కీర‌వాణి త‌న‌యుడు "కాల‌భైర‌వ" సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్‌గా జ‌ర‌గ‌నుంది. 
 
అయితే, ఈ చిత్రంలో విల‌న్ పాత్ర కోసం సూప‌ర్ స్టార్లను ఎంపిక చేయాలని యూనిట్‌ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. చిత్రంలో విల‌న్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌నుండ‌టంతో ఆ పాత్ర కోసం మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్‌లాల్‌ని సంప్ర‌దించాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఒక‌వేళ ఆయ‌న‌కి డేట్స్ ఇబ్బంది ఏర్ప‌డితే యాంగ్రీయంగ్‌మెన్ డాక్టర్ రాజ‌శేఖ‌ర్‌ని విల‌న్‌గా ఒప్పించాల‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ఓ క్లారిటీ రానుంది.