రతన్ టాటా మృతిపై ఎస్ఎస్ రాజమౌళి కామెంట్స్...
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇకలేరన్న వార్తను ఏ ఒక్క భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశానికి రతన్ టాటా చూపిన బాట, పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా రతన్ టాటా మృతిపై ఓ ట్వీట్ చేశారు.
"లెజెండ్స్ పుడతారు .. వారు ఎప్పటికీ జీవిస్తారు.
టాటా ఉత్పత్తిని ఉపయోగించకుండా ఒక రోజును ఊహించడం కష్టం...
రతన్ టాటా వారసత్వం రోజువారీ జీవితంలో భాగమైంది.
పంచభూతాలతో పాటు ఎవరైనా కాలపరీక్షకు నిలబడతారంటే అది ఆయనే.
భారతదేశం కోసం మీరు చేసిన ప్రతిదానికీ..
మరియు లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసినందుకు ధన్యవాదాలు సర్.
మీరు తరతరాలుగా నిలిచిపోయే గుర్తులను మిగిల్చారు.
మీకు సెల్యూట్...
ఎల్లవేళలా మీకు ఆరాధకుడినే..."
జై హింద్.
ఎస్ఎస్.రాజమౌళి