గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (20:15 IST)

నయనతార, విఘ్నేష్ శివన్.. ఓటీటీలో డాక్యుమెంటరీ

Nayanatara
కోలీవుడ్‌లోని ప్రముఖ జంటలలో నయనతార, విఘ్నేష్ శివన్ ఒకరు. కొన్ని సంవత్సరాల అనుబంధం తరువాత, వారిద్దరూ 2022 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. చాలామంది ప్రముఖ సెలబ్రిటీలు వారి వివాహానికి హాజరయ్యారు. 
 
నయనతార పెళ్లిని నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీగా రూపొందించబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ డాక్యుమెంటరీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ డాక్యుమెంటరీ త్వరలో ప్రసారం కానుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది.

ఇకపోతే.. గత ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అయితే నయనతార విషయంలో దర్శక నిర్మాతలకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. 
 
అలాగే షూటింగ్ లొకేషన్‌కి ఆమెతోపాటు 10 మంది సిబ్బంది వస్తారు. వాళ్ళందరి ఖర్చుకు నిర్మాత భరించాల్సిందే. తమిళంలో నిర్మాత, యూట్యూబర్ అయిన అనంతన్ నయనతారపై తీవ్ర ఆరోపణలు చేశారు. నయనతారతో పాటు ఆమె పిల్లలు కూడా షూటింగ్ లొకేషన్‌కి వస్తున్నారు. 
 
వీళ్ళ ఆలనా పాలనా చూసేందుకు నయనతార ఇద్దరు ఆయాలని పెట్టుకుంది. ఇద్దరి ఆయాల ఖర్చు కూడా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు నిర్మాతలలే భరించాలని నయన్ కండిషన్ పెట్టిందట. ఇది చాలా దారుణం అని అనంతన్ అంటున్నారు.