గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (09:36 IST)

ఇండ్లీ బండి దగ్గర ధనుష్ - D 52 మూవీ టైటిల్ ఇడ్లీ కడై

Dhanush - Idli Kadai
Dhanush - Idli Kadai
'రాయన్' తో సక్సెస్ ని అందుకున్న సూపర్ స్టార్ ధనుష్ హైలీ యాంటిసిపేటెడ్ #D52 ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా రాబోతున్న ఈ మూవీకి 'ఇడ్లీ కడై' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ని ఖరారు చేశారు. డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇండ్లీ బండి దగ్గర పిల్లలు నిల్చున్న టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ప్లజెంట్ గా వుంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
నిర్మాత ఆకాష్ బాస్కరన్ మాట్లుడుతూ.. డాన్ పిక్చర్స్ మెడిన్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రొడక్షన్ హౌస్‌కి ఒక మైల్ స్టోన్ మూవీ. ధనుష్ సర్‌తో కలిసి మా తొలి ప్రాజెక్ట్ చేయడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన ధనుష్‌ కి థాంక్ యూ' అన్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. టాప్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. కిరణ్ కౌశిక్ డీవోపీ గా పని చేస్తుండగా, ప్రసన్న జీకే ఎడిటర్, జాకీ ప్రొడక్షన్ డిజైనర్.
 
ఈ చిత్రానికి సంబధించిన నటీనటులు సంబధించిన వివరాలుని మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.