1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (11:47 IST)

ముంబైలో ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వర్ధమాన మోడల్!

గ్లామర్, సినిమా వంటి రంగుల ప్రపంచంలో వెలిగిపోవాలని, తానేంటో నిరూపించుకోవాలని ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన వర్ధమాన మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల కరమ్ జీత్ కౌర్ ఇంట్లోని సీలింగ్ ఫ్యా

గ్లామర్, సినిమా వంటి రంగుల ప్రపంచంలో వెలిగిపోవాలని, తానేంటో నిరూపించుకోవాలని ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన వర్ధమాన మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల కరమ్ జీత్ కౌర్ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. రంజాన్ పండుగ ముందురోజే ముంబై వచ్చిన ఆమె తన స్నేహితుడితో కలిసి ఆంధేరీ ప్రాంతంలో ఒక ఫ్లాట్లో ఉంటోంది. 
 
బుధవారం రాత్రి స్నేహితుడు ఇంటికి తిరిగొచ్చేసరికి లోపల నుంచి తలుపు తాళం వేసి ఉంది. తలుపులు తట్టినా కూడా ఆమె ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రంగప్రవేశం చేసి తలుపులు బద్దలు కొట్టి లోపల దృశ్యాన్ని చూసి స్నేహితుడితో సహా అందరూ నిర్ఘాంతపోయారు. 
 
ఉరేసుకుని తాడుకు వేలాడుతూ కనిపించింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె స్నేహితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కరమ్ జీత్ కౌర్ బలవన్మరణానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అవకాశాలు లేక ఇలా చేసిందా లేక ప్రేమ వ్యవహారాల కారణంగా ఇలా చేసిందాని పోలీసులు అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు.