శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 మే 2017 (15:46 IST)

సుచీ లీక్స్: ఇప్పటికీ ఆగని తారల ఫోటోలు.. చెన్నై కమిషనర్‌ను ఆశ్రయించిన సుచిత్ర

సుచీలీక్స్ దక్షిణాదిన సంచలనానికి తెరదీసిన సంగతి తెలిసిందే. అయితే తన పేరిట పలు అకౌంట్లు వున్నాయని అందులో సినీ తారల పర్సనల్ ఫోటోలు, వీడియోలు ఇంకా లీకవుతూనే వున్నాయని గాయని సుచిత్ర చెన్నై కమిషనర్ కార్యాల

సుచీలీక్స్ దక్షిణాదిన సంచలనానికి తెరదీసిన సంగతి తెలిసిందే. అయితే తన పేరిట పలు అకౌంట్లు వున్నాయని అందులో సినీ తారల పర్సనల్ ఫోటోలు, వీడియోలు ఇంకా లీకవుతూనే వున్నాయని గాయని సుచిత్ర చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గత నెల సుచిత్ర ట్విట్టర్ నుంచి ప్రముఖ దక్షిణాది సినీ తారల, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు లీక్ కావడంతో పెను సంచలనం రేగింది. 
 
సింగ‌ర్ సుచిత్ర పేరుతో ఉన్న అకౌంట్లో కోలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ప‌రువు బ‌జారుకెక్కింది. అయితే తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. హ్యాకర్లే ఇలాంటి ఫోటోలు, వీడియోలను విడుదల చేస్తున్నారని.. ఫోటోలు, వీడియోలు లీక్ కావడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని సుచిత్ర వెల్లడించింది. ఈ వ్యవహరంతో విసిగిపోయిన సుచిత్ర అమెరికాకు వెళ్ళి తిరిగి చెన్నైకి వచ్చింది. 
 
అయినప్పటికీ సుచీలీక్స్ నుంచి తారల ఫోటోలు లీక్ కావడం ఏమాత్రం ఆగలేదు. దీంతో చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దీనిపై సుచిత్ర ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హ్యాకర్లను పట్టుకోవాలని సుచిత్ర విజ్ఞప్తి చేశారు.