గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 9 జూన్ 2020 (23:23 IST)

కేస్-30 చిత్ర బృందానికి సుధీర్ బాబు అభినందనలు

యువ ప్రతిభాశాలి సందీప్ పైడిమర్రి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న వినూత్న కథాచిత్రం 'కేస్-30'. మర్డర్ మిస్టరీ నేపద్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో.. సిద్ధార్ద్ నాయుడు, శ్వేతా గర్గ్, తేజస్విని రావెళ్ల, 'రంగస్థలం' మహేష్ ముఖ్య తారాగణం. పి.ఎన్. ఆర్.ఫిల్మ్ ఫ్యాక్టరీ-యువసాయి క్రియేషన్స్ బ్యానర్స్ పై... పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఇటీవల ఈ చిత్రం టీమ్ ప్రముఖ యువ కథానాయకుడు సుధీర్ బాబును కలిసి ఆయన అభినందనలు అందుకుంది. మంచి కాన్సెప్ట్-మంచి టీమ్ తో తెరకెక్కుతున్న 'కేస్-30' కచ్చితంగా మంచి విజయం సాధించాలని సుధీర్ బాబు ఆకాక్షించారు. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని, లాక్ డౌన్ కారణంగా ఆగిన ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే.. ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్లీ మొదలు కానుంది.
 
తమను తాము ప్రూవ్ చేసుకోవాలన్న తపన కలిగిన టీమ్‌తో రూపొందుతున్న 'కేస్-30' అందరికీ చాలా మంచి పేరు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన డెబ్యూ డైరెక్టర్ సందీప్ పైడిమర్రి.. నిర్మాతలు పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి కథ: సిద్ధార్ద్ నాయుడు, సినిమాటోగ్రఫీ: గౌతమ్ బండ్రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, మాటలు: భరత్ పచ్చా, పాటలు: శశికుమార్ సాకే, సంగీతం: జెరోమ్ ఎస్.వి, నిర్మాతలు: పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సందీప్ పైడిమర్రి!!