శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (16:10 IST)

హీరో సునీల్ 'క‌న‌బ‌డుట‌లేదు' : డిటెక్టివ్ చిత్రం

హాస్య నటుడు సునీల్ ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం 'కనబడుటలేదు'. ఇది ఓ డిటెక్టివ్ చిత్రం. తాజాగా ఈ చిత్రబృందం టీజర్ విడుదల చేసింది. పోలీసులకు, డిటెక్టివ్‌లకు తేడా ఏంటో సునీల్ చెప్పడం ఈ టీజర్‌లో చూడొచ్చు. 
 
ఈ చిత్రానికి ఎం.బాలరాజు దర్శకుడు. సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనపు, దేవీప్రసాద్ బలివాడ నిర్మాతలు. ఇందులో వైశాలీ రాజ్, సుక్రాంత్ వీరెళ్ల, హిమజ, యుగ్ రామ్, ప్రవీణ్, రవివర్మ, కిరీటి దామరాజు, కంచరపాలెం కిశోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
మధు పొన్నాస్ సంగీత స్వరాలకు చంద్రబోస్, మధు నందన్, పూర్ణాచారి సాహిత్యం అందించారు. 'కనబడుటలేదు' చిత్రాన్ని స్పార్క్ ఓటీటీ విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రేక్షకులు థియేటర్లలోకి వచ్చేందుకు జంకుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.