1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2019 (18:10 IST)

సూప‌ర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయ్యింది, ఇంత‌కీ ఏంట‌ది..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా అందులో కటౌట్‌కి సెట్టయ్యే స్టిల్స్ చాలానే ఉంటాయి. ప్రస్తుతం చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా అలాంటి కటౌట్స్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా హంగామా మొదలైపోయింది. 
 
ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే... సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్ హైదరాబాద్‌లో సినిమాల అడ్డా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35MM థియేటర్ వద్ద ఈ 81 అడుగుల కటౌట్‌ని ఏర్పాటు చేశారు. మహేష్ గత సినిమాలు ఈ థియేటర్స్‌లో చాలా రికార్డులు క్రియేట్ చేశాయి. మురారి – అతడు సినిమాలు ఈ థియేటర్లో 175 రోజులకు పైగా ప్రదర్శింపబడ్డాయి. 
 
మహేష్ బాబుకి సంబంధించిన ఏ సినిమా రిలీజ్ అయినా ఈ లొకేషన్లో కటౌట్ పడాల్సిందే. సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దిల్ రాజు - అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పైన అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ఇటీవల వచ్చిన టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చేసింది. మ‌రి.. ఈసారి మ‌హేష్ బాబు ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.