సరిలేరు నీకెవ్వరు గురించి సత్యదేవ్ ఏం చెప్పాడో తెలుసా..?
జ్యోతిలక్ష్మి సినిమాతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న సత్యదేవ్.. ఆ తర్వాత బ్రోచేవారెవరురా, ఇస్మార్ట్ శంకర్, రాగల 24 గంటల్లో... ఇలా వరుసగా విభిన్న కథా చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర గురించి బయటపెట్టాడు.
ఇంతకీ సత్యదేవ్ ఏం చెప్పాడంటే... సరిలేరు నీకెవ్వరు సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాను. అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే... ఆ సినిమా గురించి వాళ్లే ఏం చెప్పడం లేదు. చిన్న పాత్ర పోషించిన నేను ఇప్పుడే మాట్లాడితే బాగుండదు. కానీ నా పాత్ర మాత్రం సినిమాలో చాలా చాలా కీలకమైనది. తక్కువ టైమ్ కనిపిస్తాను కానీ అందరికీ రిజిస్టర్ అయిపోతుంది.
మహేష్ బాబుతో వర్క్ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. మహేష్ ఓ సూపర్ స్టార్. ఆయనతో పని చేయడం అనేది మరచిపోలేని అనుభూతి. మహేష్‌ను చూస్తే అలానే చూడాలనిపిస్తుంది. ఆయన సెట్స్‌కు వస్తే ఒక రకమైన సందడి. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా చేశాను. ఆ సినిమాలో మహేష్ గారికి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకడ్ని నేను. ఇప్పుడు మహేష్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగాననే.... ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేసాడు.