శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (15:32 IST)

#SarileruNeekevvaruTeaser ప్రతి సంక్రాంతి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతి మొగుడొచ్చాడు..

అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో వస్తోన్న సినిమా ''సరిలేరు నీకెవవ్వరు'' నుంచి టీజర్ రిలీజైంది. మహేష్ బాబు తొలిసారిగా ఒక ఆర్మీ మేజర్‌గా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమా జనవరి 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ద్వారా సీనియర్ నటి విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా మరొక హీరోయిన్ సంగీత, కమెడియన్ బండ్ల గణేష్ కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
 
పక్కా కమర్షియల్, మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ కాసేపటి క్రితం యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. అంతేగాకుండా విడుదలైన క్షణాల్లోనే అదరగొట్టే వ్యూస్‌తో దూసుకెళ్తోంది. టీజర్‌లో మంచి యాక్షన్‌తో పాటు మాస్, ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా కలగలిసి ఉన్నాయి. ఆకట్టుకునే విజువల్స్, డైలాగ్స్ అదుర్స్ అనిపించేలా వున్నాయి. 
 
ఇక టీజర్‌లో 'సంక్రాంతికి అల్లుడు వస్తాడు అనుకుంటే మొగుడు వచ్చాడేంటి' అంటూ ప్రకాష్ రాజ్ పలికే డైలాగ్, 'మేము అక్కడ మీ కోసం ప్రాణాలు ఇస్తుంటే, మీరేమో కత్తులు గొడ్డళ్లు తీసుకుని ఇక్కడ ప్రాణాలు తీస్తున్నారు. బ్యాధ్యత ఉండక్కర్లేదా' అంటూ మహేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఇంకేముంది.. టీజర్‌ను మీరూ ఓ లుక్కేయండి.