బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (15:14 IST)

గుంటూరు కారంలో సూపర్ స్టార్ కృష్ణ

gunturu karam
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం గుంటూరు కారం త్వరలో థియేటర్లలోకి రానుంది. ఇటీవలే మహేష్ బాబు కుర్చి మడతపెట్టి అనే టైటిల్‌తో సినిమా యూనిట్  డ్యాన్స్ వీడియోను షేర్ చేయడంతో చాలామంది దృష్టిని ఆకర్షించింది. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. గుంటూరు కారం ఖలేజా తర్వాత త్రివిక్రమ్‌తో మహేష్ బాబుది మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో హిట్ 2 ఫేమ్ మీనాక్షి చౌదరి కూడా నటించింది. ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
 
ఈ సినిమాలో సూపర్ స్టార్ గురించి టాక్ రానుంది. ఫస్ట్ హాఫ్‌లో సూపర్‌స్టార్ కృష్ణ (మహేష్ బాబు తండ్రి) గురించి థమన్ చేత మైండ్ బ్లోయింగ్ బీజీఎం వుంటుంది.
 అలాగే సినిమా చివరి 45 నిమిషాలు కథకు మంచి గ్రిప్ ఇచ్చే సన్నివేశాలుంటాయి. 
గుంటూరు కారం తర్వాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్నాడు.