సోకులాడి స్వప్న సుందరి.. నీ మడతచూపు మాపటేల మల్లెపందరీ....
మహేశ్ బాబు - శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం "గుంటూరు కారం". త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం నుంచి హైఓల్టేజ్ సాంగ్ పూర్తి లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోతోనే చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
యంగ్ బ్యూటీ శ్రీలీలతో మహేశ్ బాబు ఉత్సాహంగా స్టెప్పులేసిన తీరు మాస్ మసాలా రేంజ్‌లో ఉర్రూతలూగిస్తున్నాయి. తమన బాణీలకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
"రాజమండ్రి రాగమంజరి... మా అమ్మ పేరు తెలవనోళ్లు లేరు మేస్తిరీ.. సోకులాడి స్వప్న సుందరీ.. మీ మడత చూపు మాపటేల మల్లెపందరీ" అంటూ ఆడియన్స్‌ను కిర్రెక్కెంచేలా రామజోగయ్య తన కలానికి పని చెప్పారు.
హారిక అండ్ సుహాసి క్రియేషన్స్ బ్యానర్‌పై మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న గంటూరు కారం చిత్రం 2024 జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువస్తుంది.