సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:31 IST)

'నన్ను క్షమించండి.. తమన్నాతో పాటు.. హీరోయిన్లందరినీ వేడుకుంటున్నా' : దర్శకుడు సూరజ్

'కాస్ట్యూమ్‌ డిజైనర్‌ హీరోయిన్‌ దుస్తులను మోకాలి కిందికి డిజైన్‌ చేసి తెస్తే.. వాటిని పొట్టిగా చేయండని ఆదేశిస్తా. నా హీరోయిన్స్‌ అలాంటి దుస్తులు ధరించడానికి అసౌకర్యంగా భావించినా.. అలానే తయారు చేయిస్తా

'కాస్ట్యూమ్‌ డిజైనర్‌ హీరోయిన్‌ దుస్తులను మోకాలి కిందికి డిజైన్‌ చేసి తెస్తే.. వాటిని పొట్టిగా చేయండని ఆదేశిస్తా. నా హీరోయిన్స్‌ అలాంటి దుస్తులు ధరించడానికి అసౌకర్యంగా భావించినా.. అలానే తయారు చేయిస్తా. ఎందుకంటే.. ప్రేక్షకులు హీరోయిన్స్‌ని అలా చూడడానికే డబ్బులు చెల్లిస్తారు' అని తమిళ దర్శకుడు సూరజ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన హీరోయిన్ తమన్నాతో పాటు.. హీరోయిన్లందరికీ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 
 
ముఖ్యంగా సూరజ్ వ్యాఖ్యలపై 'ఒక్కడొచ్చాడు' చిత్ర హీరో విశాల్‌తో పాటు... హీరోయిన్ నయనతారలు తీవ్రంగా ఖండించారు. దీంతో సూరజ్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 'నన్ను క్షమించండి.. తమన్నాకు, చిత్ర పరిశ్రమలోని నటీమణులందరికీ క్షమాపణలు. ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. మరోసారి క్షమించమని అడుగుతున్నా. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నా' అని సూరజ్‌ పేర్కొన్నారు.