శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (19:21 IST)

రెండో పెళ్లి వద్దే వద్దు.. నా భర్తతో కలలోనైనా మాట్లాడాలనుంది..

Surekha Vani
టాలీవుడ్​లో క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా మంచి పేరు కొట్టేసిన సురేఖా వాణి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న విషయాలను వెల్లడించింది. భర్త తనకెంతో గౌరవం ఇచ్చాడని.. కానీ భర్త తరపు బంధువులు తనను తప్పుగా భావించారని ఆవేదన వెల్లగక్కింది. 
 
ఆయన ఆరోగ్యం బాగోలేదని... ఎంతో ఏడ్చానని.. తను తన జీవితంలో నుంచి వెళ్లిపోయాక చాలా బాధపడ్డాను. ఆ దేవుడు ఒక రోజు, ఒక గంట నా భర్తతో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండని కోరుకుంటున్నాను. కనీసం కలలో అయినా కనపడితే మాట్లాడాలని ఉంది. భర్త చనిపోయాక చాలా కాలం తాను డిప్రెషన్​లోకి వెళ్లినట్లు అప్పుడు తన కూతురు తనకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చింది.

రెండో పెళ్లి, రిలేషన్‌షిప్ లాంటి ఆలోచనలు కూడా తనకూ ఏమీ లేవని అసలు రిలేషన్‌షిప్‌ అంటేనే భయమేస్తుందని, వాటిపై నమ్మకం లేదని కూడా చెప్పింది. డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు నెల రోజుల పాటు తిండి తినలేదని గుర్తు చేసుకుంది. ఎవరికి నచ్చినట్లు వారు దుస్తులు ధరించవచ్చునని తెలిపింది.