సాహసం గల యువకుడి కథే ఆరంభం : చిత్ర యూనిట్
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు.
జైలు నిర్బంధం నుంచి తప్పించుకున్న సాహసం గల ఒక యువకుడి కథే ఆరంభం. అన్యాయంగా అతన్ని ఎందుకు జైల్లో బంధించారు, ఈ కుట్ర వెనక ఉన్నది ఎవరు, ఈ నిర్బంధం నుంచి ఆ యువకుడు ఎలా తప్పించుకున్నాడు అనే అంశాలతో ఆసక్తికరంగా ఆరంభం సినిమా రూపొందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.
నటీనటులు - మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు